అందుబాటులో ఉంటా... అభివృద్ధి చేస్తా.. అది శ్రీనివాస్

NBN న్యూస్ బ్యూరో (పాష సయ్యద్ )వేములవాడ పట్టణం లోని హరిమల గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ వేములవాడ MLA అభ్యర్థి అది శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్బంగా అది శ్రీనివాస్ మాట్లాడుతూ 
👉🏻 కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మరోసారి ఎమ్మెల్యే గా పోటి చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు..
👉🏻 నవంబర్ 30 నాడు జరిగే ఎన్నికలో నన్ను గెలిపించాలని విజ్ఞప్తి
👉🏻 తెలంగాణ సమస్యలు ఎక్కడ క్కడే ఉండగా తెరాస నుండి బి అర్ ఎస్ గా మార్చడం రాజకీయమే . 
👉🏻 నిధులు, నియామకాలు, నీళ్ళు కోసం తెలంగాణ తెచ్చుకున్నాం
👉🏻 దళితులకు మూడు ఎకరాలు ఇవ్వలేదు, దళిత బందు, బి సి బందు, కేజీ టు పిజి ఇవ్వలేదు
👉🏻 రైతు రుణమాఫీ చేయలేదు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఆన్యాయం జరిగిన పట్టించుకోలేదు
👉🏻 డబుల్ బెడ్ రూం ల పేరిట ప్రజలను మోసం చేశారు, ఎవరికి డబుల్ బెడ్ రూం ఇవ్వలేదు
👉🏻 కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుంది.
👉🏻 కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ లు పూర్తిగా పేద ప్రజల కోసమే..
👉🏻 కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతాము,
👉🏻 కేసీఆర్ ప్రకటించిన బి అర్ ఎస్ మెనిఫెక్టో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ది కాఫీ కొట్టాడు
👉🏻 10 ఏళ్ల లో బి అర్ ఎస్ పార్టీ ఎందుకు సిలెండర్ 1200 చొప్పున వసూలు చేశారు
👉🏻 అడ్డదారుల్లో అధికారంలో కి రావడానికి మాత్రమే మేనిఫెస్టో విడుదల చేసారు
👉🏻 గతం లో కేసీఆర్ మెనిఫెక్ట్లో లో పెట్టిన ఎందుకు నెరవేర్చలేదు
👉🏻 నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు
👉🏻 ప్రజలారా ఒక్క సారి ఆలోచన చేయండి, 
👉🏻 వేములవాడ లో మూడు నెలల ముందు వచ్చిన వ్యక్తి కావాలా.. 20 ఏళ్లుగా గెలిచిన ఓడిన మీ మధ్యలో ఉన్న.. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకున్న వ్యక్తి కావాలా..ప్రజలారా ఆలోచన చేయండి
👉🏻 కార్పొరేట్ శక్తులను నమ్మకండి, 
👉🏻 మీ కార్పొరేట్ దవాఖాన లు 20 ఏళ్ల క్రితం పెడితే ఇన్నాళ్లు వేములవాడ నియోజక వర్గ ప్రజలు కనబడలేదా
👉🏻 ఇప్పటికే పరాయి దేశ వ్యక్తి పాలన వలన ఏళ్లుగా తీవ్రంగా నష్టపోయాము
👉🏻 మళ్లీ అవకాశము కోసం వలస వచ్చే నాయకుడి నీ నమ్మకండి
👉🏻 వాళ్ళు అవసరం తీరాక వెళ్లిపోతారు, కానీ నేను మీ మధ్య లోనే ఉంటాను,
👉🏻 వేములవాడ నియోజక వర్గం లో అనేక మైన సమస్యల వలయం లో చిక్కుకుంది
👉🏻 రాజన్న ఆలయం అభివృద్ధి ఎందుకు చేయలేదు, కేవలం రంగుల రంగుల బ్రోచర్ల కే పరిమితం అయింది
👉🏻 ముంపు గ్రామాల ప్రజల కోసం డబుల్ బెడ్ రూం కోసం 5 లక్షల 4 వేయులు ఇస్తానానీ మోసం చేశారు
👉🏻 మేడిపల్లి, భీమారం మండలం నుండి వేములవాడ నియోజక వర్గం కి దారి లేదు
👉🏻 ఎన్నికల వేళ ఎన్నికల కోసం మాత్రమే తాత్కాలిక జీవో చూపిస్తూ మోసం చేయడానికి వస్తారు నమ్మకండి
👉🏻 మంత్రి కెటిఆర్ ఎన్నికల వేళా ఎక్కడికి వెళ్తే అక్కడే కోనసీమగా మరుస్తా అని చెప్పడం అలవాటు
👉🏻 కాంగ్రెస్ పార్టీ అధికారం లో రాగానే రాజన్న ఆలయం ను పర్యాటక కేంద్రంగా మారుస్తాం
👉🏻వెనకబడిన వేములవాడ ను ముందుకు తీసుక పోవడానికి ఒక్క సారి అవకాశము ఇవ్వాలని వేడుకుంటున్నాను
👉🏻 అది శ్రీనివాస్ కి 14 ఏళ్ల నుండి అధికారం లేదు, అధికారం లో ఉన్నది మీరు
ఏమైనా అంటే అది శ్రీనివాస్ పక్కన ఉన్న వ్యక్తులు అందరూ ఎమ్మెల్యే లు అవుతారు అని తప్పుడు ప్రచారం మానుకోవాలి
👉🏻 అధికార పార్టీ అభ్యర్థి డబ్బుల కోసం లొంగ వద్దు ప్రజలారా, ఈ కార్యక్రమంలో పట్టణ అర్బన్, రూరర్, చందుర్తి అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, వకులాభరణం శ్రీనివాస్, పిల్లి కనకయ్య, చింతపండు రామస్వామి, జెడ్పిటిసి నాగం కుమార్, కాయతి నాగరాజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, అజీమ్, నాయకులు సంఘ స్వామి యాదవ్, చిలుక రమేష్ కూరగాయల కొమురయ్య, తూమ్మ్ మధు, కనికరపు రాకేష్, కొలకాని రాజు, మూల కిషోర్, గుర్రం తిరుపతి, సుగురి సుధాకర్, పిట్టల గంగాధర్, నాగుల రాము, నేరెళ్ల శ్రీధర్, లింగంపల్లి కిరణ్, నీలం గురవయ్య, వస్తాదు కృష్ణ, ఖమ్మం గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆశీర్వదించండి... అభివృద్ధి చేస్తా బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు.

వేములవాడ పట్టణ కూడళ్ళను సుందరికరణ చేస్తాం.. ప్రభుత్వ విప్, శాసనసభ్యులు అది శ్రీనివాస్.