వేములవాడ పట్టణ కూడళ్ళను సుందరికరణ చేస్తాం.. ప్రభుత్వ విప్, శాసనసభ్యులు అది శ్రీనివాస్.

NBN న్యూస్ బ్యూరో (పాష సయ్యద్ ) ఆగస్టు 18 : వేములవాడ పట్టణంలో కూడళ్ల అభివృద్ధిలో భాగంగా సుభాష్ నగర్ లో సుభాష్ చంద్రబోస్ విగ్రహా నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థం మాధవి తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు.
అనంతరం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో సుభాష్ నగర్కు ఒక ప్రత్యేకత ఉందని అన్నారు మొదటి నుంచి వేములవాడ పట్టణ అభివృద్ధిలో సుభాష్ నగర్ ప్రాంత ప్రజల పాత్ర ఉంటుందని అన్నారు. సుభాష్ నగర్ ప్రాంతం కులాలకు మతాలకు అతీతంగా సోదర భావంతోనే వెళ్లి విరిసే చైతన్యవంతమైన యువత మేధావులు, పెద్దలు ఉన్నటువంటి ప్రాంతం. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించి తెల్లా దొరలను పారాదొలటనికి తన విప్లవ పంతాలో దేశంలోని యువకులను మేధావులను స్వాతంత్ర ఉద్యమంలోనికి రావడానికి కృషిన గొప్ప వీరుడు సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. వేములవాడ పట్టణంలోని కూడళ్లకు కొత్త శోభ సంతరించుకునే విధంగా ప్రభుత్వం, మున్సిపల్ పాలకవర్గం ముందుకు పోతుందని అన్నారు.
భక్తుల తమ ఆరాధ్య దైవంగా భావించే రాజన్న క్షేత్రం కొలువైన వేములవాడ పట్టణాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దుతాం. వేములవాడ పట్టణంలో కొత్త శోభ సంతరించుకున్న ప్రాంతాన్ని గుర్తించి వాటిని అభివృద్ధి చేస్తామని,వేములవాడ పట్టణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఇటీవలే మున్సిపల్ పార్కును అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని మొన్నటి రోజున అంబేద్కర్ చౌరస్తా అభివృద్ధికి భూమి పూజ చేసుకున్నామని దేవాలయం దగ్గర మరో పార్క్ నిర్మాణం కాబోతోందని అన్నారు. స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పూల మొక్కలు నాటవలసిందిగా అధికారులకు చెప్పడం జరిగింది.తద్వారా చూపరులను ఆకట్టుకునే విధంగా పూల మొక్కలు పెంచడంతోపాటు ఆక్సిజన్ విరివిగా లభించేందుకు చెట్లను కూడా పెంచే కార్యక్రమం చేపడుతున్నాం.పట్టణంలో ప్రతి వార్డులో చెత్తను నాటి వాటికి టి గాడ్స్ ను ఏర్పాటు చేయాలి.
రాజన్న భక్తులకు వేములవాడ పట్టణంలోకి రాగానే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా పట్టణాన్ని తీర్చిదిద్దుతామని ఈ సందర్బంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో  మున్సిపల్ చైర్మన్ రామతిర్తపు మాధవి, కాంగ్రెస్ నాకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆశీర్వదించండి... అభివృద్ధి చేస్తా బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు.

అందుబాటులో ఉంటా... అభివృద్ధి చేస్తా.. అది శ్రీనివాస్