వేములవాడ ఆర్ డి ఓ ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన కార్యక్రమం.

NBN న్యూస్ బ్యూరో (పాష సయ్యద్)  సెప్టెంబర్ 27: వేములవాడ రెవెన్యూ డివిజనల్ అధికారి, మధుసూదన్ ఆధ్వర్యంలో వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కు సంబంధించిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశము నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త పునరీక్షణ కార్యక్రమం 2023  లో భాగంగా తేదీ:19.09.2023 వరకు  నమోదైన ఫామ్-6, 7, 8 ల వివరాలను తెలియజేశారు. కొత్తగా నమోదైన ఓటర్లు, తొలగించిన ఓటర్ల గురించి చర్చించారు. దీనికి సంబంధించి తుది ఓటరు జాబితా తేదీ  అక్టోబర్ 4న ప్రకటిస్తామని తెలిపారు. ఈ సమావేశమునకు రాజకీయ పార్టీల ప్రతినిధులు భా ర స నాయకులు పొలాస నరేందర్ వి.నిత్యానంద రావు, ఇండియన్ కాంగ్రెస్ నాయకులు, మైలారం రాము,,  డి.నరేష్  జింక ఎల్లయ్య, జింక  మలేశం, రామస్వామి గౌడ్, వేములవాడ అర్బన్ తహశీల్దార్ ఎస్.మహేష్ కుమార్, డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వేములవాడ, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఆశీర్వదించండి... అభివృద్ధి చేస్తా బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు.

వేములవాడ పట్టణ కూడళ్ళను సుందరికరణ చేస్తాం.. ప్రభుత్వ విప్, శాసనసభ్యులు అది శ్రీనివాస్.

అందుబాటులో ఉంటా... అభివృద్ధి చేస్తా.. అది శ్రీనివాస్