చట్టాల పై ప్రజలు అవగాహన పెంచుకోవాలి : సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్.ప్రేమలత.

NBN న్యూస్ బ్యూరో (పాష సయ్యద్) ప్రజలు   చట్టాల పై అవగాహన పెంచుకోవలసిన అవసరం ఉందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత సూచించారు. ఈ మేరకు జిల్లా కోర్టులో ఆవిడ శనివారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జడ్జి ప్రేమలత మాట్లాడుతూ ప్రజల్లో న్యాయం పట్ల సరియైన అవగాహన కల్పించడానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నాసా మార్గదర్శకాల ప్రకారం ప్రతిసంవత్సరం నవంబర్ 9న న్యాయ సేవా దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు.సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరికీ న్యాయ సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమని, పేదలు, కోర్టులకు రాలేని వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయిస్తే సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 9న న్యాయ సేవ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంవత్సరానికి మూడు లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి ఉచిత న్యాయ సేవలు అందిస్తారన్నారు. అర్హులైన వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్ ఉన్నారు.

Comments

Popular posts from this blog

వృధాశ్రమం లో దీపావళి వేడుకలు జరుపుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ షూ.

వేములవాడ పట్టణ కూడళ్ళను సుందరికరణ చేస్తాం.. ప్రభుత్వ విప్, శాసనసభ్యులు అది శ్రీనివాస్.

అంగ రంగ వైభవంగా మజహార్ పాష ( పోలీస్ డిపార్ట్మెంట్) కుమారుని రిసిప్షన్ వేడుకలు.