Posts

వేములవాడ పట్టణ కూడళ్ళను సుందరికరణ చేస్తాం.. ప్రభుత్వ విప్, శాసనసభ్యులు అది శ్రీనివాస్.

Image
NBN న్యూస్ బ్యూరో (పాష సయ్యద్ ) ఆగస్టు 18 : వేములవాడ పట్టణంలో కూడళ్ల అభివృద్ధిలో భాగంగా సుభాష్ నగర్ లో సుభాష్ చంద్రబోస్ విగ్రహా నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థం మాధవి తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో సుభాష్ నగర్కు ఒక ప్రత్యేకత ఉందని అన్నారు మొదటి నుంచి వేములవాడ పట్టణ అభివృద్ధిలో సుభాష్ నగర్ ప్రాంత ప్రజల పాత్ర ఉంటుందని అన్నారు. సుభాష్ నగర్ ప్రాంతం కులాలకు మతాలకు అతీతంగా సోదర భావంతోనే వెళ్లి విరిసే చైతన్యవంతమైన యువత మేధావులు, పెద్దలు ఉన్నటువంటి ప్రాంతం. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించి తెల్లా దొరలను పారాదొలటనికి తన విప్లవ పంతాలో దేశంలోని యువకులను మేధావులను స్వాతంత్ర ఉద్యమంలోనికి రావడానికి కృషిన గొప్ప వీరుడు సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. వేములవాడ పట్టణంలోని కూడళ్లకు కొత్త శోభ సంతరించుకునే విధంగా ప్రభుత్వం, మున్సిపల్ పాలకవర్గం ముందుకు పోతుందని అన్నారు. భక్తుల తమ ఆరాధ్

అంగ రంగ వైభవంగా మజహార్ పాష ( పోలీస్ డిపార్ట్మెంట్) కుమారుని రిసిప్షన్ వేడుకలు.

Image
వేములవాడ కు చెందిన మజహార్ పాష (పోలీస్ డిపార్ట్మెంట్ ) కుమారుడు జీ షాన్ NRI రీసెప్షన్ పార్టీ మల్లారం రోడ్డు లో గల రాజ శ్రీ ఫంకషన్ హాల్ లో అంగ రంగ వైభవంగా జరిగింది. ఈ రీసెప్షన్ పార్టీ లో వేములవాడ శాసనసభ్యులు అది శ్రీనివాస్, పోలీస్ అధికారులు, ప్రముఖులు, బంధు మిత్రులతో పాటు సయ్యద్ బ్రదర్స్ పాష సయ్యద్, సయ్యద్ రసూల్, అహ్మద్ నవాస్, ఖాజ నయిమోద్దీన్, హనీ ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు. 

చట్టాల పై ప్రజలు అవగాహన పెంచుకోవాలి : సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్.ప్రేమలత.

Image
NBN న్యూస్ బ్యూరో (పాష సయ్యద్) ప్రజలు   చట్టాల పై అవగాహన పెంచుకోవలసిన అవసరం ఉందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత సూచించారు. ఈ మేరకు జిల్లా కోర్టులో ఆవిడ శనివారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జడ్జి ప్రేమలత మాట్లాడుతూ ప్రజల్లో న్యాయం పట్ల సరియైన అవగాహన కల్పించడానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నాసా మార్గదర్శకాల ప్రకారం ప్రతిసంవత్సరం నవంబర్ 9న న్యాయ సేవా దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు.సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరికీ న్యాయ సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యమని, పేదలు, కోర్టులకు రాలేని వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయిస్తే సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 9న న్యాయ సేవ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంవత్సరానికి మూడు లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి ఉచిత న్యాయ సేవలు అందిస్తారన్నారు. అర్హులైన వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో లోక్ అదాలత్ సభ్యులు చింత

అందుబాటులో ఉంటా... అభివృద్ధి చేస్తా.. అది శ్రీనివాస్

Image
NBN న్యూస్ బ్యూరో (పాష సయ్యద్ )వేములవాడ పట్టణం లోని హరిమల గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ వేములవాడ MLA అభ్యర్థి అది శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా అది శ్రీనివాస్ మాట్లాడుతూ  👉🏻 కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మరోసారి ఎమ్మెల్యే గా పోటి చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.. 👉🏻 నవంబర్ 30 నాడు జరిగే ఎన్నికలో నన్ను గెలిపించాలని విజ్ఞప్తి 👉🏻 తెలంగాణ సమస్యలు ఎక్కడ క్కడే ఉండగా తెరాస నుండి బి అర్ ఎస్ గా మార్చడం రాజకీయమే .  👉🏻 నిధులు, నియామకాలు, నీళ్ళు కోసం తెలంగాణ తెచ్చుకున్నాం 👉🏻 దళితులకు మూడు ఎకరాలు ఇవ్వలేదు, దళిత బందు, బి సి బందు, కేజీ టు పిజి ఇవ్వలేదు 👉🏻 రైతు రుణమాఫీ చేయలేదు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఆన్యాయం జరిగిన పట్టించుకోలేదు 👉🏻 డబుల్ బెడ్ రూం ల పేరిట ప్రజలను మోసం చేశారు, ఎవరికి డబుల్ బెడ్ రూం ఇవ్వలేదు 👉🏻 కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుంది. 👉🏻 కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ లు పూర్తిగా పేద ప్రజల కోసమే.. 👉🏻 కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతాము, 👉🏻 కేసీఆర్ ప్రక

ఆశీర్వదించండి... అభివృద్ధి చేస్తా బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు.

Image
NBN న్యూస్ బ్యూరో (పాష సయ్యద్ ) వేములవాడ అక్టోబర్ 14:  ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముస్లిం మైనార్టీలు అంటే ఎనలేని ప్రేమని, వారి సంక్షేమం కోసం ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. శనివారం వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ముస్లిం  సోదరుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా చల్మెడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ముఖ్యంగా అన్ని వర్గాల సంక్షేమ ధ్యేయంగా కేసీఆర్ పాలన కొనసాగుతుందని, అందుకే సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి ని చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వేములవాడ పట్టణంలో షాదీ ముబారక్ పథకంతో సుమారు 350 మంది ఆడబిడ్డలకు లబ్ది చేకూరిందని, 45మందికి  మైనార్టీ బంధు రావాల్సి ఉన్న ఎన్నికల నేపథ్యంలో రాలేకపోయిందని, అది తప్పకుండా వస్తుందని అన్నారు. వేములవాడ పట్టణ ముస్లింల ప్రధాన సమస్యలైన షాదీఖానా నిర్మాణం, గురుకుల పాఠశాల, స్మశాన వాటిక తదితర అభివృద్ధి తప్పకుండా చేసి చూపిస్తానని, నియోజకవర్గంలో ఉన్న ముస

విధుల పట్ల అంకిత భావంతో పని చేయాలి.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

Image
విధుల పట్ల అంకిత భావంతో పని చేయాలి. నేరాల నియంత్రణకై విసిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి.  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. NBN న్యూస్ బ్యూరో (పాష సయ్యద్ )    సెప్టెంబర్ 27 : వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ వేములవాడ డీస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డ్స్ ను,సిడి ఫైల్స్ తనిఖీ చేసి ,సబ్ డిివిజనల్ పరిధిలో నమోదు అయిన కేసుల వివరాలు,ఎస్సీ ఎస్టీ, ఫోక్సో కేసుల, గ్రేవ్ కేసులలో,అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసుల వివరాల అడిగి తెలుసుకుని పలు సూచనలు చేసి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లలోఎక్కువగా నమోదవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం వార్షిక తనిఖీల్లో భాగంగా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు, రికార్డ్స్ , సీడీ ఫైల్స్ ను ఫంక్షన్ హాల్ వర్టికల్స్ అమలు తీరు,స్టేషన్ లో అమలవుతున్న 5s తీరును పరిశీలించి నమోదు అయిన కేసులల్లో ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఉండాలని కేసుల్లో శిక్షల శాతం పెంచాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎస్పీ  మాట్లాడుతూఅధికారులు, సిబ్బంది విధులల్లో అలసత్వం వహించకూడదని,పోలీసులు అంకితభావంతో

వేములవాడ ఆర్ డి ఓ ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన కార్యక్రమం.

Image
NBN న్యూస్ బ్యూరో (పాష సయ్యద్)  సెప్టెంబర్ 27: వేములవాడ రెవెన్యూ డివిజనల్ అధికారి, మధుసూదన్ ఆధ్వర్యంలో వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కు సంబంధించిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశము నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త పునరీక్షణ కార్యక్రమం 2023  లో భాగంగా తేదీ:19.09.2023 వరకు  నమోదైన ఫామ్-6, 7, 8 ల వివరాలను తెలియజేశారు. కొత్తగా నమోదైన ఓటర్లు, తొలగించిన ఓటర్ల గురించి చర్చించారు. దీనికి సంబంధించి తుది ఓటరు జాబితా తేదీ  అక్టోబర్ 4న ప్రకటిస్తామని తెలిపారు. ఈ సమావేశమునకు రాజకీయ పార్టీల ప్రతినిధులు భా ర స నాయకులు పొలాస నరేందర్ వి.నిత్యానంద రావు, ఇండియన్ కాంగ్రెస్ నాయకులు, మైలారం రాము,,  డి.నరేష్  జింక ఎల్లయ్య, జింక  మలేశం, రామస్వామి గౌడ్, వేములవాడ అర్బన్ తహశీల్దార్ ఎస్.మహేష్ కుమార్, డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వేములవాడ, తదితరులు పాల్గొన్నారు.